56 ఏళ్ల వాడితో ఛీ …. నేనా


nimrat kaur denied rumours56 సంవత్సరాల రవిశాస్త్రి తో నేను డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు రాసారు , ఛీ …….. నేను అతడితో డేటింగ్ చేయడం లేదు అవన్నీ గాలివార్తలే అని అంటోంది హాట్ భామ నిమ్రత్ కౌర్ . మోడల్ గా , హీరోయిన్ గా రాణిస్తున్న 36 సంవత్సరాల నిమ్రత్ కౌర్ తాజాగా రవిశాస్త్రితో ఓ వేడుకలో పాల్గొనడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు మొదలయ్యాయి ఆ తర్వాత మరోసారి మళ్ళీ ఇద్దరూ జంటగా కనిపించడంతో ఇక డేటింగ్ లో ఉన్నారని పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి . ఆ వార్తలన్నీ చూశానని , చాలా బాధపడ్డానని ఈ వార్తలన్నీ చూసాక నాకు రూట్ కెనాల్ అవసరం వస్తుందేమో అనిపిస్తోందని అంత బాధపడ్డానని అంటోంది 36 ఏళ్ల నిమ్రత్ కౌర్ .

ప్రముఖ క్రికెటర్ రవిశాస్త్రి అప్పట్లో అమ్మాయిలకు కళల రాకుమారుడు ,పలు యాడ్స్ లలో కూడా నటించి అమ్మాయిల మనసు దోచాడు . అప్పట్లోనే మాజీ హీరోయిన్ అమృతసింగ్ తో జోరుగా ప్రేమాయణం సాగించాడు . అయితే ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ 36 ఏళ్ల నిమ్రత్ తో రవిశాస్త్రి డేటింగ్ అంటూ కథనాలు వచ్చాయి .

English Title: nimrat kaur denied rumours