కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల‌నుకున్నా- అనుష్క‌


కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల‌నుకున్నా- అనుష్క‌
కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల‌నుకున్నా- అనుష్క‌

బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి వంటి వ‌రుస చిత్రాల‌తో పూర్తిగా అల‌సిపోయాను. దీంతో రిలాక్స్ కోసం కొంత కాలం సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌నుకున్నాను. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా వుండాల‌నుకున్నాను ఆ టైమ్‌లోనే `నిశ్శ‌బ్దం` మూవీ నా ముందుకు వ‌చ్చింది. హేమంత్ మ‌ధుక‌ర్ చెప్పిన క‌థ వినగానే నా నిర్ణ‌యాన్ని మార్చుకున్నాను` అన్నారు అనుష్క‌. `బాహుబ‌లి` త‌రువాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్నారామె.

అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన అనుష్క ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. సినిమాలో నా పాత్ర డెఫ్‌ అండ్ డెమ్‌. ఈ పాత్ర కోసం ఇండియ‌న్  సైన్ లాంగ్వేజ్ లో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నాను. ఈ పాత్ర‌ని ఓ ఛాలెంజింగ్ తీసుకుని చేశాను. అయితే అమెరికా వెళ్లిన‌ప్పుడు అక్క‌డి సైన్ లాంగ్వేజ్ వేరుగా వుంటుంద‌ని తెలిసి 14 ఏళ్ల అమ్మాయి వ‌ద్ద అమెరికాలో శిక్ష‌ణ తీసుకున్నాన‌ని, ఇందు కోసం రెండు నెల‌లు ప‌ట్టింద‌ని చెప్పింది అనుష్క‌.

ఓటీటీ, థియేట‌ర్ రెండు వేరు వేరుగా ఉన్న‌ప్ప‌టికీ ఓటీటీలో సినిమాలు విడుద‌ల చేయ‌డాన్ని అంతా పాజిటివ్‌గా చూడాల్సిన అవ‌స‌రం వుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల రీత్యా సినిమా ఇండ‌స్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే టెక్నాల‌జీ ప‌రంగా ఆడియ‌న్స్ కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇవ్వ‌డంలో ఇలాంటి మార్పులు రావ‌డం అవ‌స‌రం. వాటిని అంతా సంపూర్ణంగా స్వాగ‌తించడం అత్యంత అవ‌స‌రం. ఇక తొలిసారి నేను న‌టించిన సినిమా ఇలా విడుద‌లవ్వ‌డం నాకు కాస్త కొత్త‌గా అనిపిస్తోంది. అలానే సమేము చేసిన ఈ కొత్త ప్ర‌య‌త్నాన్ని ఆడియ‌న్స్ అంతా స్వాగ‌తిస్తార‌ని ఆశిస్తున్నాను` అన్నారు అనుష్క‌. `ఆది పురుష్‌`లో సీత పాత్రలో తాను న‌టించ‌డం లేద‌ని, త‌న‌ని ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని అనుష్క స్ప‌ష్టం చేశారు.