నిత్యామీనన్ పై నిషేధమా ?


నిత్యామీనన్ పై నిషేధమా ?
నిత్యామీనన్

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ పై నిషేధం విధించాలని కొంతమంది అదేపనిగా పట్టుబడుతున్నారు . దర్శక నిర్మాతల ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆమేరకు మలయాళ చిత్ర పరిశ్రమ లోని పెద్దలు జోక్యం చేసుకొని నిత్యామీనన్ తో మాట్లాడగా గుండెలు బద్దలయ్యే నిజం తెలిసిందట ! నిత్యామీనన్ తల్లి క్యాన్సర్ తో బాధపడుతోంది , పైగా చివరి స్టేజ్ లో ఉందని అందుకే నిత్యా సినిమా షూటింగ్ లకు రాకుండా దర్శక నిర్మాతలకు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని తెలిసిందట .

తెలుగు , తమిళ , మలయాళ చిత్రాల్లో నటిస్తున్న నిత్యామీనన్ కొద్దిరోజులుగా షూటింగ్ లకు హాజరు కాకుండా , సరైన సమాధానం ఇవ్వకుండా దర్శక నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తోందట దాంతో ఆమెపై నిషేధం విధించాలని సమావేశం ఏర్పాటు చేస్తే అప్పుడు అసలు విషయం తెలిసిందట నిత్యా తల్లి కి క్యాన్సర్ అని అందుకే కొద్దిరోజులు వేచి చూడండి అని పెద్దలు చెప్పారట . పాపం నిత్యా మీనన్ కు నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి .