నితిన్ – షాలినిల ఎంగేజ్‌మెంట్ రేపే!



నితిన్ - షాలినిల ఎంగేజ్‌మెంట్ రేపే!
నితిన్ – షాలినిల ఎంగేజ్‌మెంట్ రేపే!

యంగ్ హీరో నితిన్ ఎపంపుడెప్ంపుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. దుబాయ్‌లో అట్ట‌హాసంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని క‌ల‌లు క‌న్న నితిన్‌కు ప్ర‌ధాన విల‌న్‌గా నిలిచింది క‌రోనా. దీని వ‌ల్లే దుబాయ్‌లో జ‌రుపుకోవాల్సిన వివాహాన్ని నితిన్ అతి క‌ష్టం మీద హైద‌రాబాద్‌కు మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఏప్రిల్‌లో వివాహం చేసుకోవాల‌ని ప్లాన్ చేసినా క‌రోనా వ‌ల్ల ఫైన‌ల్‌గా జూలైకి మార్చుకున్నారు.
ఈ నెల 26న రాత్రి 8:30 గంట‌ల‌కు నితిన్ వివాహం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

వివాహ తేదీని ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యులు ప్ర‌క‌టించేశారు. నితిన్ కూడా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా త‌న పెళ్లి షెడ్యూల్‌ని వివ‌రంగా చెప్పేశాడు. మంగ‌ళ‌వారం పెళ్లి ప‌త్రిక‌ల‌ని నితిన్ పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స్వ‌యంగా వెళ్లి పెళ్లి ప‌త్రిక‌ని నితిన్ అందించ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో హంగామా మొద‌లుపెట్టారు.

రేపు అంటే 22 బుధ‌వారం ఎంగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మం ఉద‌యం జ‌ర‌గ‌నుంది. ఇక మెహెందీ ఫంక్ష‌న్ ఈ నెల 23న గురువారం నిర్వ‌హించ‌‌నున్నారు. 24న ప్రీ మ్యారేజ్ వేడుక‌ని నిర్వ‌హిస్తార‌ట‌. అయితే నిశ్చితార్థం వేదిక ఎక్క‌డ‌న్న‌ది మాత్రం హీరో నితిన్ స్ప‌ష్టం చేయ‌లేదు.