నితిన్ వెడ్డింగ్ షెడ్యూల్ ఇదే!నితిన్ వెడ్డింగ్ షెడ్యూల్ ఇదే!
నితిన్ వెడ్డింగ్ షెడ్యూల్ ఇదే!

యంగ్ హీరో నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ఆయ‌న క‌లల్ని క‌రోనా కాటేసింది. లావిష్ వెడ్డింగ్ కి క‌రోనా పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో చేసేదేమీ లేక హీరో నిఖిల్ త‌ర‌హాలోనే నితిన్  సింగిల్ వెడ్డింగ్ కి రెడీ అయిపోయిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్నేళ్లుగా ఫ్యామిలీ ఫ్రెండ్ షాలినితో ప్రేమ‌లో వున్న నితిన్ ఎట్ట‌కేల‌కు ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమించిన షాలినినే వివాహం చేసుకుంటున్నారు.

ఈ నెల 26న నితిన్ , షాలినిల వెడ్డింగ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో నితిన్ సోష‌ల్ మీడియా ద్వారా పెళ్లికి సంబంధించిన షెడ్యూల్‌ని అప్‌డేట్ చేశారు. ఈ నెల 22 నుంచి పెళ్లి హంగామా ప్రారంభం కాబోతోంది. 22న ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నార‌ట‌. 23న మెహందీ ఫంక్ష‌న్ వుంటుంద‌ని, 24న ప్రీ మ్యారేజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని, 26 రాత్రి 8:30 గంట‌ల‌కు వివాహం జ‌రుగుతుంద‌ని అదీ లెక్క అంటూ నితిన్ ఇన్ స్టా వేదికగా అప్‌డేట్ ఇచ్చాడు.

అయితే వివాహం ఎక్క‌డో మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. కొంత మంది ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో అని ప్ర‌చారం చేస్తున్నా ఇంత వ‌ర‌కు ఆ విష‌యాన్ని నితిన్ స్ప‌ష్టం చేయ‌లేదు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల‌కు సంబంధించిన వ్య‌క్తుల‌తో పాటు అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన‌నున్నార‌ట‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీల‌కు ప్ర‌స్తుత ప‌రిస్థితులు మారాక నితిన్ స్పెష‌ల్ పార్టీ ఇవ్వాల‌నుకుంటున్నార‌ట‌.