వైజాగ్‌లో `భీష్మ‌` విజ‌యోత్స‌వం!


వైజాగ్‌లో `భీష్మ‌` విజ‌యోత్స‌వం!
వైజాగ్‌లో `భీష్మ‌` విజ‌యోత్స‌వం!

నితిన్ హీరోగా న‌టించిన చిత్రం `భీష్మ‌`. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ నుంచే పాజిటీవ్ టాక్‌ని, వైబ్స్‌ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తోంది. నితిన్ కెరీర్‌లోనే ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోనూ దుమ్ముదులిపేస్తోంది.

గ‌త కొంత కాలంగా హీరో నితిన్ సాలీడ్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వ‌రుస మూడు ప‌రాజ‌యాల త‌రువాత నితిన్ న‌టించిన ఈ సినిమాపై టీమ్ మొద‌టి నుంచి ఫుల్ కాన్ఫిడెంట్‌గా వుంది. సినిమా రిలీజ్ కావ‌డం అనూహ్య విజ‌యాన్ని సాధించి టీమ్ పెట్ట‌కున్న న‌మ్మ‌కం నిజం కావ‌డంతో అంతా సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. ఈ నెల 21న విడుద‌లైన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా, టాక్ ప‌కంగా నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఈ స‌క్సెస్ ఇచ్చిన ఆనందంలో వున్న చిత్ర టీమ్ ఈ నెల 29న విజ‌యేత్స‌వ వేడుక‌ని నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ గురువారం మీడియాకు వెల్ల‌డించారు. శ‌నివారం సాయంత్రం వైజాగ్‌లోని ఉడా కాంప్లెక్స్‌, సిరిపురంలోని గుర‌జాడ క‌ళాక్షేత్రంలో అశేష అభిమానుల మ‌ధ్య‌ అత్యంత భారీగా ఈ కార్య‌క్ర‌మాన్ని చిత్ర బృందం నిర్వ‌హించ‌బోతోంది. ఈ వేడుక కోసం చిత్ర బృందం ఇప్ప‌టికే ఏర్పాట్లు ప్రారంభించింద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో హీరో నితిన్‌, హీరోయిన్ రష్మిక‌తో పాటు చిత్ర ప్ర‌ధాన తార‌గ‌ణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటార‌ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ వెల్ల‌డించారు.