ప్లాప్ భామ అంటే ఆసక్తి చూపిస్తున్న నితిన్


ప్లాప్ భామ అంటే ఆసక్తి చూపిస్తున్న నితిన్
ప్లాప్ భామ అంటే ఆసక్తి చూపిస్తున్న నితిన్

యంగ్ హీరో నితిన్ వరస పరాజయాల నుండి బయటపడి ఇటీవలే భీష్మతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే. అందరినీ లాభాల్లో నిలిపిన ఈ చిత్రం నిన్నటి నుండి ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ జరగట్లేదు కానీ లేదంటే ఈపాటికి అందులో ఒక చిత్ర షూటింగ్ కొలిక్కి వచ్చేసేది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే చిత్రాన్ని కూడా సైన్ చేసాడు.

ఈ రెండూ కాకుండా లాక్ డౌన్ కు ముందు అంధాధూన్ సినిమా రీమేక్ కు ముహూర్తం కూడా చేసుకున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్ర తెలుగు రీమేక్ కు మేర్లపాక గాంధీను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. అంధుడి పాత్రను వేయగలనా లేదా అన్న సంశయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి ఈ సినిమా చేస్తున్నానని ప్రకటించాడు నితిన్.

ప్రస్తుతం సినిమా షూటింగ్స్ జరగకపోయినా నితిన్ తన తర్వాతి సినిమాల విషయంలో దృష్టి కేంద్రీకరించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ సినిమా ప్లాపవ్వడంతో ప్రియాంకకు తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. మరి నితిన్ ఎందుకని ఈ ప్లాప్ భామను ఎంచుకున్నాడో తెలీదు. అయితే అంధాధూన్ లో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. అయితే ఈ సినిమాలో ఒక హాట్ సన్నివేశం మాత్రం ఉంటుంది. మరి తెలుగు రీమేక్ లో ఈ సన్నివేశంలో ప్రియాంక నటిస్తుందా లేక తొలి సినిమా తరహాలోనే పద్దతిగా నటిస్తుందా అన్నది తెలియాలి.