నితిన్ రష్మికను ఏడిపించడం ఆపట్లేదుగా



నితిన్ రష్మికను ఏడిపించడం ఆపట్లేదుగా
నితిన్ రష్మికను ఏడిపించడం ఆపట్లేదుగా

యంగ్ హీరో నితిన్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తన లేటెస్ట్ సినిమా భీష్మ విజయంపై నమ్మకంతో ఉన్నాడు. హ్యాట్రిక్ ప్లాపులు వచ్చినా కానీ భీష్మపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే భావిస్తోంది ట్రేడ్ కూడా. హిట్ కళ ఉన్న నితిన్ ఇప్పుడు మీడియాకు విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసిన విషయం తెల్సిందే. భీష్మ సెట్స్ లోనే రష్మిక, నితిన్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ చనువుతో రష్మికను ఆడుకుంటున్నాడు మన హీరో. ఎంతలా అంటే అతని వ్యాఖ్యల వల్ల హీరోయిన్ ను సోషల్ మీడియాలో  ట్రోల్ చేస్తున్నారు అయినా కానీ నితిన్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సందర్భం ఏదైనా ఆమెను ఏడిపించడం ఎక్కడా ఆపట్లేదు.

మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో మనందరం సాయంత్రం పూట స్నాక్స్ టైమ్ లో టిఫిన్ లేదా మరేదైనా తింటాం కానీ రష్మిక మాత్రం కుక్క బిస్కట్లు తింటుంది అని ఆమె ఎంత వారిస్తున్నా కానీ చెప్పేసాడు నితిన్. దానికి ఆమె ఎంతలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందో మనందరం చూసాం. ఇక ఇష్యూ అక్కడితో అయిపోలేదు. రీసెంట్ గా జరిగిన ఫంక్షన్ లో కూడా నితిన్ ఈ టాపిక్ ఎత్తాడు. ఆమెను పొగిడినట్లే పొగిడి ట్రోలింగ్ కు మరోసారి కారణమయ్యేలా చేసాడు. రష్మిక ఫిట్నెస్, అందం వెనుక రహస్యం ఆమె తినే ఫుడ్డే అని చెప్పిన నితిన్, ఆ ఫుడ్ ఏంటనేది మాత్రం తనను అడగొద్దని చెప్పాడు. అది చాలా స్పెషల్ అని వెటకారంగా అన్నప్పుడు కచ్చితంగా కుక్క బిస్కట్ల టాపిక్ ఏ అని అందరికీ అర్థమైపోయింది.

ఇక్కడ కూడా రష్మిక అతణ్ణి వారించింది. అయినా కూడా నితిన్ రష్మికను ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు చేసాడు. సరదాగా అన్నా బయట ట్రోలింగ్ చేస్తున్నారు. అయినా రష్మిక వీటిని స్పోర్టివ్ గా తీసుకోవడం మాత్రం మెచ్చుకోవాలి.