ఐ మిస్ యు త్రివిక్రమ్ గారు అంటూ బోరుమన్న హీరో !!


nithiin crying
nithiin crying

‘చలో’ మూవీతో హిట్ సాధించిన టాలెంటెడ్ దర్శకుడు వెంకీ కుడుముల. ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా భీష్మ చిత్రం రూపొందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యస్.

నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిరంతరంగా జరుగుతోంది.

నితిన్ గత సినిమా ‘అ.. ఆ’ షూట్ చేసిన లొకేషన్లోనే ‘భీష్మ‘ షూటింగ్ జరుగుతోంది. ఆ లొకేషన్స్ లోనే ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.

ఆ సమయంలో అ.. ఆ జర్నీని నెమరు వేసుకుంటూ తలచుకొని ఏడ్చేశాడంట నితిన్. పైగా ఈ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ”అ.. ఆ అదో అద్భుతమైన జర్నీ. అదే లొకేషన్ లో షూట్ చేస్తుండటంతో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఐ మిస్ యూ త్రివిక్రమ్ గారు” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నితిన్..!!