నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి అంతా రెడీ?నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి అంతా రెడీ?
నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి అంతా రెడీ?

గ‌త కొంత కాలంగా యంగ్ హీరో నితిన్ ప్రేమ‌లో వున్నాడ‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా నితిన్ పెళ్లికి సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బ‌టికి వ‌చ్చింది. హైద‌రాబాద్‌కి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ షాలినితో నితిన్ గ‌త నాలుగేళ్లుగా ప్రేమ‌లో వున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీకారం తెలిపార‌ని ఏప్రిల్‌లో వివాహానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తాజా స‌మాచారం.

ఏప్రిల్ 15న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేశార‌ని, ఇందు కోసం ఇప్ప‌టి నుంచే గెస్ట్‌ల‌కు వెడ్డింగ్ కార్డ్స్ అంద‌జేసే ప‌ని మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది. ఏప్రీల్ 16న హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్‌ని ఏర్పాటు చేస్తార‌ట‌. పెళ్లి కోసం ఇప్ప‌టికే 50 నుంచి 60 మంది గెస్ట్‌ల‌ని సెలెక్ట్ చేసిన‌ట్టు, వారి కోసం ప్ర‌త్యేకంగా ఫ‌స్ట్ క్లాస్ టికెట్స్ బుక్ చేస్తున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

నితిన్ ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `భీష్మ‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. హెబ్బా ప‌టేల్ మ‌రో నాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.