నిన్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు నితిన్‌!


నిన్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు నితిన్‌!
నిన్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు నితిన్‌!

హీరోలు ఈ మ‌ధ్య కాలంలో త‌మ వ్య‌క్తిగ‌త సిబ్బందికి, డైరెక్ట‌ర్‌ల‌కు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇవ్వ‌డం ట్రెండ్‌గా మారింది. ల‌క్ష‌ల్లో గిఫ్ట్‌లు ఇచ్చే హీరోలు ఇప్పుడు వ్య‌క్తి గ‌త సిబ్బందికి డైరెక్ట‌ర్‌ల‌కు అర కోటి పైనే విలువ చేసే ఖ‌రీదైన కార్ల‌ని బ‌హుమ‌తులుగా ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చాలా రోజుల త‌రువాత హీరో మ‌హేష్‌కు `శ్రీ‌మంతుడు` సినిమాతో సూప‌ర్ హిట్ ల‌భిస్తే ఆ ఆనందాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు హీరో మ‌హేష్ గిఫ్ట్‌గా  ఆడీకారు ఇవ్వ‌డం తెలిసిందే.

ఇటీవ‌ల హీరో ప్ర‌భాస్ త‌న వ్య‌క్తిగ‌త ట్రైన‌ర్ కు 65 నుంచి 75 ల‌క్ష‌ల విలువ చేసే రేంజ్ రోవ‌ర్ కార్‌ని బ‌హుమ‌తిగా అంద‌జేయ‌డం, దానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోక‌ముందే యంగ్ హీరో నితిన్ కూడా రేంజ్ రేవ‌ర్ గిఫ్ట్‌తో వార్త‌ల్లో నిలిచారు. నితిన్‌కు `ఆహా` త‌రువాత హిట్ లేదు. అలాంటి టైమ్‌లో `భీష్మ‌`తో నితిన్‌కు వెంకీ కుడుముల హిట్టిచ్చారు.

దానికి బ‌దులుగా యంగ్ టాటెంటెడ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌కు నితిన్ రేంజ్ రోవ‌ర్ కార్‌ని బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్లు త‌న కోసం శ్ర‌మించిన వెంకీ కుడుముల‌కు రేంజ్ రోవ‌ర్ కారిచ్చి బ‌ర్త్ కు స‌ర్‌ప్రైజ్ చేశారు నితిన్‌. ప్ర‌స్తుతం నితిన్ `రంగ్ దే` చిత్రాన్ని చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ మూవీని త్వ‌ర‌గా పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.