సీఎంనీ క‌ల‌సి చెక్ అంద‌జేసిన హీరో!


సీఎంనీ క‌ల‌సి చెక్ అంద‌జేసిన హీరో!
సీఎంనీ క‌ల‌సి చెక్ అంద‌జేసిన హీరో!

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. ఎంత లాక్ డౌన్ విధించినా ఎక్క‌డి కక్క‌డ కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే వున్నాయి. క‌రోరాపై ప్ర‌స్తుతం ప్ర‌పంచం యుద్ధం చేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌ని అరిక‌ట్టే వ్యాక్సిన్‌ని క‌నిపెట్టే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే అమెరికా లాంటి దేశం క‌రోనా వైర‌స్‌కు విరుగుడుని క‌నిపెట్టే ప్ర‌యోగాల్ని మొద‌లుపెట్టింది.

ఇదిలా వుంటే క‌రోనా స‌హ‌య నిధి కోసం కొంత మంది సెల‌బ్రిటీలు త‌మ వంతు బాధ్య‌త‌గా విరాళాలు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతు బాధ్య‌త‌గా హీరో నితిన్ తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి 10 ల‌క్ష‌లు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 10 ల‌క్ష‌ల‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చెక్‌ని హీరో నితిన్ మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ని క‌లిసి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నితిన్‌తో మాట్లాడిన కేసీఆర్ అత‌న్ని ఆత్మీయంగా ఆలిగ‌నం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌రోనా జాతీయ విప‌త్తుకు స్పందించిన మొట్ట‌మొద‌టి టాలీవుడ్ హీరో నితిన్ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. నితిన్ ప్రారంభించిన ఈ ఒర‌వ‌డిని ఎంత మంది హీరోలు అనుస‌రిస్తారో చూడాలి.