ప్లాప్ డైరెక్టర్ పై రిస్క్ కు నితిన్ రెడీ

ప్లాప్ డైరెక్టర్ పై రిస్క్ కు నితిన్ రెడీ
ప్లాప్ డైరెక్టర్ పై రిస్క్ కు నితిన్ రెడీ

యంగ్ హీరో నితిన్ వరస ప్లాపుల నుండి ఇటీవలే ఊరట పొందిన విషయం తెల్సిందే. గత నెలలో విడుదలైన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆఫ్ సీజన్ లో విడుదలైనా కూడా ఈ చిత్రం 25 కోట్ల పైన షేర్ సాధించడం విశేషం. అదే మంచి సీజన్ లో విడుదలై ఉంటే ఈజీగా 35 కోట్ల షేర్ మార్క్ ను దాటేది. భీష్మ తర్వాత నితిన్ వరస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే రంగ్ దే షూటింగ్ లో  నితిన్, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండింటితో పాటు ఇటీవలే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా మొదలైన విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ చిత్రం అంధధూన్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. ఒక్కసారి పరిస్థితులు సద్దుమణిగితే కానీ మళ్ళీ షూటింగ్స్ పై క్లారిటీ వచ్చే  అవకాశం లేదు.

ఈ మూడు సినిమాలు కాకుండా నితిన్ ఒక రెండు సినిమాల సిరీస్ ను కూడా ఓకే చేసాడు. తన స్నేహితుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే రెండు సినిమాల సిరీస్ ను ఏడాది చివర్లో మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. రౌడీ ఫెలోతో ఇంప్రెస్ చేసిన కృష్ణ చైతన్య తర్వాత ఛల్ మోహన్ రంగాతో నిరాశపరిచాడు. అందులో కూడా నితిన్ హీరో అన్న విషయం తెల్సిందే. తనకు ప్లాప్ ఇచ్చినా కానీ తన స్నేహితుడు కృష్ణ చైతన్యపై నమ్మకముంచాడు నితిన్. పవర్ పేట భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన సినిమా. దీని కోసం నితిన్ స్వయంగా నిర్మాతగా కూడా మారుతున్నాడు. పవర్ పేటపై భారీ నమ్మకముంచిన నితిన్ ఇటీవలే ఒప్పుకున్న సినిమాలు అన్నిట్లో లాస్ట్ లో పెట్టాడు. ఈ సినిమాలు విడుదలైతే కానీ మరో సినిమా మొదలెట్టకూడదు అనుకుంటున్నాడు. వచ్చే సమ్మర్ కు పవర్ పేట మొదటి భాగం విడుదలయ్యే సూచనలు ఉన్నాయి.