నితిన్ కొత్త‌ చిత్రం టైటిల్ `మాస్ట్రో`!

నితిన్ కొత్త‌ చిత్రం టైటిల్ `మాస్ట్రో`!
నితిన్ కొత్త‌ చిత్రం టైటిల్ `మాస్ట్రో`!

టాలీవుడ్ హీరోలు మునుపెన్న‌డూ లేనంతా సినిమాల ప‌రంగా స్పీడు పెంచారు. ఒక మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే మ‌రో మూవీని సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ లాంటి వాళ్లైతే రెండు రిలీజ్ అయితే మ‌రో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది నితిన్ న‌టించిన రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. చెక్‌, రంగ్ దే.

ఈ రెండు చిత్రాల్లో `రంగ్ దే` సూప‌ర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని వసూళ్ల ప‌రంగా ట్రేడ్ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇదిలా వుంటే నితిన్ న‌టిస్తున్న 30వ చిత్రం కూడా రెడీ అయిపోతోంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎన్. సుధాక‌ర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్ల‌పాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఫిల్మ్ `అంధాధున్‌` ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్నా కీల‌క పాత్ర‌ని పోషిస్తున్నారు.

మంగ‌ళ‌వారం హీరో నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌ని, ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి `మాస్ట్రో` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఇంత వ‌ర‌కు నితిన్ న‌ట‌న‌కు ఆస్కార‌మున్న ఛాలెంజిగ్ పాత్ర‌లో న‌టించ‌లేదు. ఇదే తొలిసారి కావ‌డం, జాతీయ స్థాయిలో పుర‌స్కారం అందుకున్న పాత్ర‌లో నితిన్ న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లోనూ, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలున్నాయి. జూన్ 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.‌