హీరో నితిన్ మనసు మార్చు కున్నాడా?


హీరో నితిన్ మనసు మార్చు కున్నాడా?
హీరో నితిన్ మనసు మార్చు కున్నాడా?

హీరో నితిన్ మనసు మార్చు కున్నాడా అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో కరోనా కారణంగా సింపుల్ వెడ్డింగ్స్ జాతర నడుస్తోంది. యంగ్ హీరో నిఖిల్, నిర్మాత దిల్ రాజు ఇటీవల సింపుల్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అదే పంథా లో రానా కూడా రెడీ అయిపోతున్నాడు.

ఆగస్టు 8న రానా – మిహికాల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. Ee విషయాన్ని ఇటీవలే సురేష్ బాబు వెల్లడించారు కూడా. ఇదిలా ఉంటే యంగ్ హీరో నితిన్ కూడా సింపుల్ పెళ్ళికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లాంగ్ టైమ్ గాళ్ ఫ్రెండ్ శాలినితో ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకున్న నితిన్ కరోనా ఉదృతి తగ్గిన తరువాత దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని ప్లాన్ చేసాడు.
అయితే కరోనా విళయతాండవం చేస్తుండటంతో మనసు మార్చుకుని వచ్చేనెలలో వివాహం చేసుకోవాలని నిర్యాయించుకున్నాడట. ముహూర్తం కుదిరితే జులైలో లేదంటే ఆగస్టు లో వివాహాం చేయసాలని నితిన్ పేరెంట్స్ ముహుర్తాలు చూస్తున్నారట. హైదరాబాద్ లో జరగనున్న ఈ వివాహానికి అత్యంత సన్నిహితులు , కొంత మంది స్టార్స్ మాత్రమే హాజరు కానున్నారని తెలిసింది.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లని నితిన్ పేరెంట్స్ ఇప్పటికే మొదలు పెట్టారట. పెళ్లి జులై లో పూర్తయితే ఆగస్టు లో ‘రంగ్ డే’ షూటింగ్ లో పాల్గొనాలని నితిన్ ప్లాన్  చేస్తున్నట్టు చెబుతున్నారు.