ఏడాదిన్నరలో ఆరు సినిమాలను రెడీ చేస్తున్న నితిన్


ఏడాదిన్నరలో ఆరు సినిమాలను రెడీ చేస్తున్న నితిన్
ఏడాదిన్నరలో ఆరు సినిమాలను రెడీ చేస్తున్న నితిన్

2016 లో అ..ఆ సినిమా ద్వారా హిట్ అందుకున్న నితిన్ కు ఆ తర్వాత సరైన విజయం లేదు. 2017, 18లో మూడు సినిమాలను విడుదల చేసిన నితిన్ వాటితో ప్లాపులు అందుకున్నాడు. 2019లో నితిన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే 2020లో వరస సినిమాలతో ఆ లోటును తీర్చడానికి రెడీ అయ్యాడు. నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా భీష్మ రేపు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భీష్మ తన కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు నితిన్. తన నెక్స్ట్ సినిమా రంగ్ దే షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టేసింది నితిన్ పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసాడు. ఈ సినిమా జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు.

దాని తర్వాత చిత్రం చంద్ర శేఖర్ యేలేటి తో చేస్తున్న విషయం కూడా ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు నితిన్. ఈ సినిమాకు చెక్ అనే టైటిల్ పెట్టగా ఎక్కువ శాతం జైల్లోనే చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. షూటింగ్ ఇటీవలే మొదలవ్వగా సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు.

అక్కడితో అయిపోలేదు. నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఈ రీమేక్ ను మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నాడు. వేసవి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలై, ఇయర్ ఎండింగ్ లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తన స్నేహితుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అని 2 సినిమాల సిరీస్ ను చేయనున్నాడు నితిన్. ఈ ఏడాది ఆఖర్లో సినిమా షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే ఈ రెండు సినిమాలను విడుదల చేయబోతున్నాడు. అంటే ఏడాదిన్నర గ్యాప్ లో ఏకంగా ఆరు సినిమాల రిలీజ్ లు అన్నమాట. ఈ ఏడాది చివర్లో మరిన్ని స్క్రిప్ట్ లను వినాలని డిసైడ్ అయ్యాడు ఈ కొత్త పెళ్లి కొడుకు.