నితిన్ ఆ సినిమా చేస్తున్నందుకు భయపడుతున్నాడట!


నితిన్ ఆ సినిమా చేస్తున్నందుకు భయపడుతున్నాడట!
నితిన్ ఆ సినిమా చేస్తున్నందుకు భయపడుతున్నాడట!

యంగ్ హీరో నితిన్ 12 ఏళ్ల స్ట్రగుల్ పీరియడ్ తర్వాత ఇష్క్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మధ్యలో ఒకట్రెండు ప్లాపులు వచ్చినా కెరీర్ సాఫీగానే సాగిపోయింది. అయితే మళ్ళీ గత మూడేళ్ళ నుండి కెరీర్ లో స్లంప్ వచ్చింది. నితిన్ గత మూడు సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. దాంతో పాటు ఒక ఏడాదికి పైగా సినిమాలేం చేయకుండా గడిపేశాడు. ఈ నేపథ్యంలో తన మార్కెట్ డౌన్ అయ్యి ఉంటుందని అందరూ ఊహించారు. అయితే భీష్మ సినిమాకు జరిగిన బిజినెస్ చూసి వాళ్ళ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. అంతే కాకుండా ఇప్పుడు భీష్మ సూపర్ డూపర్ టాక్ తో మొదలైంది. తొలి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ ఈ సినిమాను చుట్టుముట్టేసింది. ఒక మంచి ఎంటర్టైనర్ అని, హాయిగా నవ్వుకునే సినిమా ఇది అవుతుందని అందరూ అంటున్నారు. క్రిటిక్స్ రేటింగ్స్ తో పాటు ఆడియన్స్ టాక్ కూడా బాగుంది. సో నితిన్ నుండి మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. ఇది కూడా నితిన్ కు ఒక విధంగా కంబ్యాక్ లాంటి మూవీనే.

ఇక భీష్మ కాకుండా ఈ ఏడాది మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్. అందులో ఒక రీమేక్ కూడా ఉంది. ఎప్పుడో ప్లాపుల్లో ఉన్నప్పుడు ఒక రీమేక్ సినిమాలో నటించాడు. టక్కరి పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం దారుణమైన ప్లాప్. మళ్ళీ రీమేక్ ల జోలికి వెళ్లని నితిన్ మళ్ళీ ఇన్నేళ్ళకి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధధూన్ రీమేక్ లో నటిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమాను కన్ఫర్మ్ చేసిన నితిన్, దర్శకుడిగా వేంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా లాంటి సినిమాలతో హిట్లు కొట్టిన మేర్లపాక గాంధీ పేరుని ప్రకటించాడు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మించనుంది. ఇక ఈ సినిమా విశేషాలు చెబుతూ చేస్తున్నందుకు భయంగా ఉందని చెప్పడం విశేషం. దానికి కారణం ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ నటించిన పాత్రలో తాను నటిస్తుండడం వల్లనేనట. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదలవుతుందని తెలిపాడు.