బ్ర‌హ్మ‌చారుల కోసం నితిన్ స్పెష‌ల్ గిఫ్ట్‌!

బ్ర‌హ్మ‌చారుల కోసం నితిన్ స్పెష‌ల్ గిఫ్ట్‌!
బ్ర‌హ్మ‌చారుల కోసం నితిన్ స్పెష‌ల్ గిఫ్ట్‌!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన `మ‌ళ్లీశ్వ‌రి` చిత్రంలోని పెళ్లి కాని ప్ర‌సాద్ డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. తాజాగా పెళ్లి చేసుకోమ‌ని భీష్మించుకుని కూర్చున్న‌ బ్ర‌హ్మ‌చారుల కోసం నితిన్ అందించ‌బోతున్నస్పెష‌ల్ గిఫ్ట్ కూడా అంతే పాపుల‌ర్ కానుంద‌ని చెబుతున్నారు. నితిన్ న‌టిస్తున్నతాజా చిత్రం `భీష్మ‌`. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి `ఛ‌లో` చిత్రంలో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని పొందిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

తెలుగు ప్రేక్ష‌కుల్లో క్రేజీ క‌థానాయిక‌గా పేరు తెచ్చుకున్న క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్నహీరోయిన్‌గా న‌టిస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా హేభా ప‌టేల్ న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ గ్లింప్స్‌ని న‌వంబ‌ర్ 6న చిత్ర బృందం రిలీజ్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. సినిమా ఎలా వుండ‌బోతోంది?, ఇందులో ర‌ష్మిక‌, నితిన్ మ‌ధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో వుంటుంద‌న్న‌ది ఫ‌స్ట్ లుక్‌లోనే తేలిపోయింది. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా హీరో నితిన్ వెల్ల‌డించారు. నితిన్ ఈ చిత్రంలో బ్ర‌హ్మ‌చారిగా క‌నిపించ‌బోతున్నారు. అయితే త‌న‌లాగే ప్రేమ‌, పెళ్లి అవ‌స‌రం లేద‌ని భీష్మించుకుని కూర్చున్న బ్ర‌హ్మ‌చారుల కోసం ప్ర‌త్యేకంగా ఈ పాట‌ని అందించ‌బోతున్నార‌ట‌. ఒక విధంగా చెప్పాలంటే r ఇది పాట కాద‌ని, బ్ర‌హ్మ‌చారుల ఎమోష‌న్ అని అంతే కాకుండా ఇది బ్ర‌హ్మ‌చారుల‌ అంతెంగా వుంటుంద‌ని నితిన్ ప్ర‌క‌టించారు. ఈ నెల 27న ఈ ప్ర‌త్యేక గీతాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

Credit: Twitter