నితిన్ స్పీడు మామూలుగా లేదుగా!నితిన్ స్పీడు మామూలుగా లేదుగా!
నితిన్ స్పీడు మామూలుగా లేదుగా!

యంగ్ హీరో నితిన్ ఓ ప‌క్క పెళ్లి ప‌నుల్లో బిజీగా వుంటూనే మ‌రో ప‌క్క వ‌రుస సినిమాల‌తో జోరు పెంచేశారు. వ‌రుస‌గా నాలుగు చిత్రాల్ని ట్రాక్‌లో పెట్టేసుకున్నారు. `అఆ` త‌రువాత ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోతున్న నితిన్ ఈ సారి ఎలాగైనా బిగ్ హిట్‌తో ఆ లోటుని భ‌ర్తీ చేసుకోవాల‌ని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల‌తో `భీష్మ‌` చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తు్న ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్‌కు రెడీ అయిపోతోంది.

ఇదిలా వుంటే మ‌రో మూడు చిత్రాల్ని లైన్‌లో పెట్టిన నితిన్ వ‌రుస‌గా ఒక‌దానికి వెన‌క ఒక సినిమాని సైలెంట్‌గా సెట్స్‌పైకి తీసుకెళిపోతున్నాడు. ఇప్ప‌టికే వెంకీ అట్లూరితో `రంగ్‌దే` చిత్రాన్ని చేస్తున్న నితిన్ వెర్స‌టైల్ చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో ఓ విభిన్న‌మైన సినిమాకు శ్రీ‌కారం చుట్టాడు. జైలు నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి `చెక్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఈ నెల 15న షాలినితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసుకున్న నితిన్ నాలుగ‌వ చిత్రానికి డైరెక్టర్‌ని ఫిక్స్ చేసేసుకున్నాడ‌ని తెలిసింది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `అంధాధూన్‌` చిత్ర తెలుగు రీమేక్ హ‌క్కుల్ని నితిన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్‌ని కూడా త్వ‌ర‌లోనే మొద‌లుపెట్ట‌బోతున్నారు. దీనికి మేర్ల‌పాక గాంధీని ద‌ర్శ‌కుడిగా ఓకే చేసుకున్నార‌ట‌. మేర్ల‌పాక గాంధీ దాదాపు ఏడాదిన్న‌ర క్రితం నానితో `కృష్ణార్జున యుద్ధం` చిత్రాన్ని రూపొందించారు. ఆ త‌రువాత మ‌రో ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అత‌నికి `అంధాధూన్‌`ని రీమేక్ చేసే అవ‌కాశాన్ని ఇవ్వ‌డం ఆస‌క్తికరంగా మారింది.