దుబాయ్‌లో మొద‌లుపెట్టిన నితిన్‌!


దుబాయ్‌లో మొద‌లుపెట్టిన నితిన్‌!
దుబాయ్‌లో మొద‌లుపెట్టిన నితిన్‌!

ఈ ఏడాది ప్రారంభంలో `భీష్మ‌`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు యంగ్ హీరో నితిన్. ఈ మూవీ త‌రువాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారాయ‌న‌. వెంకీ అట్లూరితో `రంగ్‌దే`. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో
`చెక్‌` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఈ రెండు చిత్రాల‌తో పాటు నితిన్ మ‌రో చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశారు.

బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `అంధాధూన్‌`. జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ ఖురానాకు ఉత్త‌మ న‌టుడిగా వార్డుని అందించి వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై నితిన్ ఫాద‌ర్ ఎన్ . సుధాక‌ర్‌రెడ్డి, సోద‌రి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ మూవీ షూటింగ్ సోమ‌వారం దుబాయ్‌లో మొద‌లైంది.

ఇందులో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా నితిన్‌, న‌భా న‌టేష్‌ల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని హీరో నితిన్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. సెట్స్‌లో పియానో వాయిస్తున్న ఓ ఫొటోని కూడా షేర్ చేశారు. త‌మ‌న్నా ఇందులో టబు పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. జ‌న‌వ‌రి నుంచి జ‌ర‌గ‌బోయే కీల‌క షెడ్యూల్‌లో త‌మ‌న్నా పాల్గొంటుంద‌ట‌.