విమర్శ‌ల‌‌కు `చెక్` పెట్టిన నితిన్‌, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి!


విమర్శ‌ల‌‌కు `చెక్` పెట్టిన నితిన్‌, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి!
విమర్శ‌ల‌‌కు `చెక్` పెట్టిన నితిన్‌, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి!

విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి యంగ్ హీరో నితిన్‌తో ఓ భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రానికి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి `చెక్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు.

ఈ చిత్ర టైటిల్‌, ప్రీలుక్ పోస్ట‌ర్‌ని గురువారం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రిలీజ్ చేశారు. ఉరిశిక్ష‌ప‌డిన ఖైదీ క‌థ గా చ‌ద‌రంగం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో న‌తిన్ ఉరిశిక్ష ప‌డిన ఖైదీ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అత‌న్ని కాపాడే యువ‌తిగా లాయ‌ర్ పాత్ర‌లో ర‌కుల్ న‌టిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూఈ ఆగిపోయిందంటూ ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. ఆ క‌థ‌నాల‌కు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి టైటిల్, ప్రీ లుక్‌తో చెక్ పెట్టారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ నెల 12 నుంచి చివ‌రి షెడ్యూల్‌ని ప్రారంభించి ఈ నెలాఖ‌రు వ‌రకు చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌బోతున్నారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, త్రిపుర‌నేని సాయిచంద్‌, సంప‌త్‌రాజ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రోహిత్ పాథ‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఎవ‌రు ఎవ‌రికి చెక్ పెట్టార‌న్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. హీరో నితిన్ ఇంత వ‌ర‌కు ఈ త‌ర‌హా సినిమా చేయ‌లేదు. చంద్ర‌శేఖ‌ర్  ఏలేటి మార్కులో వుంటూనే క‌మర్షియ‌ల్ అంశాల మేళ‌వింపుతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే చిత్ర‌మిద‌ని చిత్ర నిర్మాత వి. ఆనంద‌ప్ర‌సాద్ వెల్ల‌డించారు.