డిసెంబ‌ర్‌లో హీరో నితిన్ వివాహం?


డిసెంబ‌ర్‌లో హీరో నితిన్ వివాహం?
డిసెంబ‌ర్‌లో హీరో నితిన్ వివాహం?

క‌రానా వైర‌స్ కార‌ణంగా పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌భుత్వాలు కూడా భారీ స‌మూహాలు, భారీ ఆర్భాటాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. అతి త‌క్కువ మందికి మాత్ర‌మే శుభ‌కార్యాల‌కు అనుమ‌తులిస్తున్నారు. అతి త‌క్కువ మంది బంధువుల మ‌ధ్య వివాహం చేసుకోవ‌డం ఇష్టం లేని వాళ్లంతా త‌మ వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు.

త‌క్కువ మంది వున్నా స‌రే పెళ్లి ముఖ్యం అనుకున్న వాళ్లు మాత్రం వివాహాలు చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇదొక చ‌ర్చ‌గా మారింది.  ఇటీవ‌ల స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్ నిరాడంబ‌రంగా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఏప్రిల్‌లో వివాహం చేసుకోవాల‌ని భావించిన నిఖిల్ క‌రోనా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో పెళ్లిని వాయిదా వేసుకుని ఇటీవ‌ల వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

నిఖిల్ త‌ర‌హాలోనే హీరో నితిన్ దుబాయ్‌లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా గెబ్బ‌తో ప్లాన్ అంతా తారుమారైంది. దీంతో త‌న వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా నితిన్ కూడా నిఖిల్ త‌ర‌హాలోనే వివాహం చేసుకుంటారేమో అని వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నితిన్ త‌న వివాహాన్ని డిసెంబ‌ర్‌కు వాయిదా వేసిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే నితిన్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. హీరో రానా వివాహం కూడా డిసెంబ‌ర్‌లో జ‌ర‌పాల‌ని డి. సురేష్‌బాబు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.