రిలీజ్‌కు ముందే లాభాల బాట‌లో `భీష్మ‌`!


రిలీజ్‌కు ముందే లాభాల బాట‌లో `భీష్మ‌`!
రిలీజ్‌కు ముందే లాభాల బాట‌లో `భీష్మ‌`!

నితిన్ క‌థానాయ‌కుడిగా నాలుగు చిత్రాలు లైన్‌లో వున్నాయి. వెంకీ అట్లూరి `రంగ్ దే`, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి `ఛెక్‌`, కృష్ణ చైత‌న్య `ప‌వ‌ర్ పేట‌`, వెంకీ కుడుముల `భీష్మ‌`. ఈ నాలుగు చిత్రాల్లో మూడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. వెంకీ కుడుముల రూపొందిస్తున్న `భీష్మ‌` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. క్రేజీ క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశి నిర్మిస్తున్నారు.

`అఆ`తో సూప‌ర్‌హిట్ చిత్రాన్ని సొంతం చేసుకున్న‌నితిన్ ఈ సినిమాతో 50 కోట్ల క్ల‌బ్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత చేసిన `లై, ఛ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీ‌నివాస క‌ల్యాణం వ‌రుస‌గా ప‌రాజ‌యాల్ని అందించాయి. దీంతో నితిన్ ఆశ‌ల‌న్నీ `భీష్మ‌`పైనే పెట్టుకున్నారు. 23 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలి లుక్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రానికి 33 కోట్ల బిజినెస్ జ‌రిగింది. అంటే పెట్టిన పెట్టుబడికి 10 కోట్ల ప్రాఫిట్ వ‌చ్చింద‌న్న మాట‌.

ఇలా నితిన్ న‌టించిన ఓ చిత్రానికి రిలీజ్‌కు ముందు టేబిల్ ప్రాఫిట్ రావ‌డం ఇదే ప్ర‌ధ‌మం కావ‌డంతో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ధ భారీగానే క‌లెక్ష‌న్‌లు వ‌సూలు చేసే అవ‌కాశం వుంద‌ని, ర‌ష్మిక గ్లామ‌ర్ కూడా ఈ చిత్రానికి మరింత‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ త‌రువాత `భీష్మ‌` నితిన్ కెరీర్‌ని ఎలాంటి మ‌లుపులు తిప్పుతుందో చూడాలి.