నితిన్ పెళ్లి డేట్ మ‌ళ్లీ ఫిక్స‌య్యేది అప్పుడే!

నితిన్ పెళ్లి డేట్ మ‌ళ్లీ ఫిక్స‌య్యేది అప్పుడే!
నితిన్ పెళ్లి డేట్ మ‌ళ్లీ ఫిక్స‌య్యేది అప్పుడే!

యంగ్ హీరో నితిన్ వివాహం ఈ నెల 16న జ‌ర‌గాల్సిన విష‌యం అంద‌రికి తెలిసిందే. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా విప‌త్క‌ర ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో కేంద్రం లాక్ డౌన్‌ని విధించింది. ఈ స‌మ‌యంలో ఎరూ ఎలాంటి ఫంక్ష‌న్‌లు గానీ, స‌మూహంగా ఏర్ప‌డ‌టం కానీ చేయ‌కూడ‌ద‌ని, ఆంక్ష‌లు విధించింది.

దీంతో ముఖానికి మాస్కులు వేసుకుని వివాహం చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, పైగా ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వివాహం చేసుకోవాల‌నుకోవ‌డం లేద‌ని, అ నెల 16న జ‌ర‌గాల్సిన త‌న వివాహాన్ని వాయిదా వేస్తున్నాన‌ని నితిన్ మీడియాకు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పుల వ‌చ్చిన త‌రువాత పెళ్లి ఎప్పుడ‌న్న‌ది తెలియ‌జేస్తాన‌ని వెల్ల‌డించారు.

డెస్టినేష‌న్ వెడ్డింగ్ కి ప్లాన్ చేసుకున్న నితిన్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అది సాధ్యం కాద‌ని గ‌మ‌నించి వాయిదా వేసుకున్నారు. వ‌చ్చే మూడు లేదా నాలుగు నెల‌ల త‌రువాత  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పు రాదు కాబ‌ట్టి అప్పుడే త‌ను కోరుకున్న స్టైల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌ని నితిన్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.