నితిన్ వివాహానికి అంతా సిద్ధ‌మా?


నితిన్ వివాహానికి అంతా సిద్ధ‌మా?
నితిన్ వివాహానికి అంతా సిద్ధ‌మా?

ఇండ‌స్ట్రీలో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిర్స్ చాలా మందే వున్నారు. అందులో నితిన్ పెళ్లిచేసుకోబోతున్నారంటూ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గ‌త కొంత కాలంగా నితిన్ ప్రేమ‌లో వున్నార‌ని, అత్యంత స‌న్నిహితంగా వుంటున్న ఓ యువ‌తిని ప్రేమిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్త‌లపై నితిన్ ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. దీంతో మ‌రో వార్త జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో నితిన్ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని, ఇందుకు ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీక‌రించార‌ని తాజాగా వినిపిస్తోంది. దుబాయ్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌రహాలో నితిన్ త‌న వివాహాన్ని జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారని. డేట్‌ని కూడా ఫిక్స్ చేసుకున్నార‌ని తెలిసింది. నితిన్ వివాహం ఏప్రిల్ 15న అంగ‌రంగ వైభ‌వంగా దుబాయ్‌లో జ‌ర‌గ‌నుంద‌ట‌.

ఈ వేడుక‌లో పాల్గొనే గెస్ట్‌ల‌కు సంబంధించిన లిస్ట్‌ని కూడా తాజాగా ఫైన‌ల్ చేశార‌ని, అరేంజ్ క‌మ్ ల‌వ్ మ్యారేజ్‌గా జ‌ర‌గ‌బోతున్న ఈ వెడ్డింగ్ కోసం అప్పుడే పనులు ప్రారంభించార‌ని తాజా స‌మాచారం. నితిన్ ప్ర‌స్తుతం వెంకీ కుడుముల రూపొందిస్తున్న `భీష్మ‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 21న వ‌డుద‌ల కానుంది.