మెగా మేన‌ల్లుడికి నితిన్ పంచ్‌!


మెగా మేన‌ల్లుడికి నితిన్ పంచ్‌!
మెగా మేన‌ల్లుడికి నితిన్ పంచ్‌!

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ జోరుగా న‌డుస్తోంది. ఇటీవ‌ల నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవ‌డం.. యంగ్ హీరో నిఖిల్ త‌ను అనుకున్న ముహూర్తాన్ని కరోనా కార‌ణంగా వాయిదా వేసుకుని తాజాగా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక  సింగిల్ సింగిల్ అంటూనే హీరో నితిన్  ఏప్రిల్ 16న షాలినితో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇదే జోరులో రానా హైద‌రాబాదీ అమ్మాయి మిహీకా బ‌జాజ్‌ని వివాహం చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగా హీరోలు వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌ధ్య పెళ్లి సంభాష‌ణ మొద‌లై వైర‌ల్ అయింది. ఇదిలా వుంటే మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భొగ‌వ‌ల్ల బాపినీడు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన సింగిల్ `నో పెళ్లి.. దాం త‌ల్లి..` అంటూ సాగే గీతాన్ని హీరో నితిన్ ఈ సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్ని రోజులు ఇలా సింగిల్‌గా వుంటావో నేను చూస్తా. కొన్ని సార్లు చేసుకోవ‌డంతో టైమ్ గ్యాప్ వుంటుందేమో కానీ చేసుకోవ‌డం మాత్రం ప‌క్కా` అని సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు నితిన్ ఈ సంద‌ర్భంగా వేసిన పంచ్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ పాట‌లో మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ కూడా సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో గొంతు క‌ల‌ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.