సాయిధ‌ర‌మ్‌తేజ్‌పై యంగ్ హీరో ట్వీట్ వైర‌ల్‌!

సాయిధ‌ర‌మ్‌తేజ్‌పై యంగ్ హీరో ట్వీట్ వైర‌ల్‌!
సాయిధ‌ర‌మ్‌తేజ్‌పై యంగ్ హీరో ట్వీట్ వైర‌ల్‌!

సాయిధ‌ర‌మ్‌తేజ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రంలో ని థ‌ర్డ్ సింగిల్ `ఒగ్గేసి పోకే అమృతా.. నేను మందు తాగుతా…` అంటే సాగే బ్రేక‌ప్ సాంగ్‌ని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

త‌మ‌న్ సంగీతం అందించిన ఈ థ‌ర్డ్ సింగిల్ న‌భా న‌టేష్ , సాయిధ‌ర‌మ్‌తేజ్‌ల‌పై చిత్రీక‌రించారు. ఇద్ద‌రి మధ్య బ్రేక‌ప్ నేప‌థ్యంలో ఈ పాట రానుంది. ఈ సంద‌ర్భంగా  ` నా ప్రియ‌మైన సాయి ధ‌ర‌మ్‌తేజ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రం నుంచి `అమృతా..` పాట‌ను రిలీజ్ చేస్తున్నా. నీలాగే సింగిల్గా వున్న ఎంతో మంది కోసం ఈ పాట ఎంజాయ్ ` అని చిరు ట్వీట్ చేశారు.

చిరుతో పాటు చాలా మంది సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు అయితే యంగ్ హీరో నితిన్ చేసిన పోస్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు డార్లింగ్‌…బ్యాచిల‌ర్‌గా ఆఖ‌రి పుట్టిన రోజు ఎంజాయ్ చెయ్‌.. ఇంత‌కీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశావ్‌` అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సాయి ధ‌ర‌మ్‌తేజ్ ఈ ఏడాది వివాహం చేసుకోఎబోతున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో నితిన్ చేసిన ట్వీట్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.