ల‌వ్‌స్టోరీ ఎలా మొద‌లైందో చెప్పేశాడు!Nithin open up his love story with shalini
Nithin open up his love story with shalini

యంగ్ హీరో నితిన్ గ‌త కొంత  కాలంగా ఎంబీఏ స్టూడెంట్ షాలినితో ప్రేమ‌లో వున్నాడంటూ, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపిస‌తున్న విష‌యం తెలిసిదే. తాజాగా ఈ వార్త‌ల‌పై ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించి త‌న ల‌వ్‌స్టోరీపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. షాలిని ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నితిన్, షాలినిల వివాహం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీక‌రించార‌ని. ఈ నెల 15న హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతోంది.

ఏప్రిల్ 15న దుబాయ్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌. ఇందు కోసం ఇటీవ‌లే ఏర్పాట్టు కూడా మొద‌లుపెట్టేశారు. గెస్ట్‌ల లెక్క కూడా తేల్చేశారు. 50 నుంచి 60 మంచి గెస్ట్‌లు దుబాయ్‌లో జ‌ర‌గ‌బోయే వివాహానికి హాజ‌రు కానున్నార‌ని, వారి కోసం ఇప్ప‌టికే ప్ర‌త్యేకంగా ఫ్లైట్ టిక్కెట్‌ల‌ని కూడా బుక్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే త‌న ల‌వ్‌స్టోరీ పై ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్‌ని హీరో నితిన్ చెప్పేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎనిమిదేళ్ల క్రితం ల‌వ్‌స్టోరీ మొద‌లైంద‌ని, అంద‌రిలా రోటీన్‌గా కాకుండా కొంచెం కొత్త‌గా ప్ర‌పోజ్ చేశాన‌ని, త‌న‌కి న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేసింద‌ని, ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా షాలిని ప‌రిచ‌యం అయ్యింద‌ని, తొలిసారి క‌లిసి న‌ప్పుడు ఒక‌రిని ఒక‌రం చూసుకోలేద‌ని, స‌డ‌న్‌గా అది సంభ‌వించింద‌ని, అప్ప‌టి నుంచే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంద‌ని నితిన్ ఓ సినిమా ల‌వ్‌స్టోరీలా వివ‌రించ‌డం ఆక‌ట్టుకుంటోంది.