అర‌వై ఏళ్ల వ్యక్తిగా యంగ్ హీరో నితిన్‌‌?


అర‌వై ఏళ్ల వ్యక్తిగా యంగ్ హీరో నితిన్‌‌?
అర‌వై ఏళ్ల వ్యక్తిగా యంగ్ హీరో నితిన్‌‌?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వున్నారు. తను న‌టిస్తున్న రెండు చిత్రాల `రంగ్ దే`,  చెక్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి.  ఈ రెండు సినిమాలు త్వరలో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదిలా వుంటే బాలీవుడ్ హిట్ చిత్రం `అంధాధున్` రీమేక్ చిత్రం షూటింగ్ ని నితిన్ ఇటీవ‌లే ప్రారంభించాడు.

దీనితో పాటు నితిన్ `పవర్ పేట` అనే పీరియడ్ డ్రామాలోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణ‌చైత‌న్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. చాలా కాలంగా రెగ్యుల‌ర్‌ షూటింగ్ వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీని ప్రారంభించాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో నితిన్ 60 ఏళ్ల రాజకీయ నాయకుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. స‌రికొత్త కథతో  ఏలూరు స‌మీపంలోని కొల్లేరు నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రంలో స‌రికొత్త గెటప్ లో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా నితిన్ క‌నిపిస్తార‌ట‌.

దీనికి సంబంధించిన ఫోటోషూట్ ఇటీవ‌లే పూర్త‌యింది. నితిన్ ఓల్డ్ మాన్ గెటప్ లో మేక‌ప్ టెస్ట్ ని పూర్తి చేశార‌ట‌. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్‌లో ఓల్డ్‌మెన్  గెటప్‌కు సంబంధించిన పోర్ష‌న్ ను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌బోతున్నారు.