ఓటీటీకి నితిన్ కూడా సై అంటున్నాడా?

ఓటీటీకి నితిన్ కూడా సై అంటున్నాడా?
ఓటీటీకి నితిన్ కూడా సై అంటున్నాడా?

క‌రోనా కార‌ణంగా సినిమాల‌న్నీ ఓటీటీ బాట ప‌ట్ట‌క త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన 25వ చిత్రం లేదు లేదంటూనే ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే.
ఇదే బాట‌లో మ‌రికొన్ని చిత్రాలు క్యూ క‌ట్ట‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొన్ని క‌న్ఫ‌ర్మ్ కూడా అయిపోయాయి. మ‌రి కొన్ని క‌న్ఫ‌ర్మ్ కాబోతున్నాయి. ఆ జాబితాలో యంగ్ హీరో నితిన్ న‌టించిన చిత్రం కూడా చేర‌బోతోంది.

నితిన్ ఈ ఏడాది `భీష్మ‌` చిత్రంతో బిగ్ హాట్‌ని సొంతం చేసుకున్నాడు. మూడు వ‌రుస ఫ్లాపుల త‌రువాత నితిన్ ఈ సినిమాతో సాలీడ్ హిట్‌ని ద‌క్కించుకున్నాడు. ఈ మూవీ త‌రువాత నితిన్ ఇమ్మీడియ‌ట్‌గా ప్రారంభించిన చిత్రం `రంగ్ దే`. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పీసీ శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. ఈ నెల చివ‌రి వారం నుంచి షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని టీమ్ ప్లాన్ చేస్తోంది.

షూటింగ్ ఫాస్ట్‌గా ఫినిష్ చేసి చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్‌, జీ5 నుంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏ సంస్థ అధికంగా కోట్ చేస్తే వారికి `రంగ్ దే` ని ఇచ్చేయాల‌నుకుంటున్నార‌ట‌. యూర‌ప్ షెడ్యూల్ కూడా ఈ డీల్‌ని బ‌ట్టే వుంటుంద‌ని చెబుతున్నారు.