నితిన్‌, ర‌ష్మిక‌ల కెమిస్ట్రీ అదిరిందిగా!


 

Nithin, Rashmika chemistry adurs 
Nithin, Rashmika chemistry adurs

నితిన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `భీష్మ‌`. క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. `ఛ‌లో` సినిమాతో మంచి రైజింగ్‌లో వున్న వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

ప్రేమ‌, పెళ్లి,  అంటూ ప‌డ‌ని బ్ర‌హ్మ‌చారిగా నితిన్ పాత్ర‌ని ఈ చిత్రం కోసం దర్శ‌కుడు వెంకీ కుడుముల కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన బ్ర‌హ్మ‌చారుల అంథెమ్ సాంగ్‌తో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి `వాటే బ్యూటీ..` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ పాట‌లో నితిన్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

స్టెప్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. పాట‌లోనే ఇంత కెమిప్ట్రీ పండితే సినిమాలో చెప్పేదేముందీ అదిరినోద్ది అంతే అంటున్నారు. క‌న్న‌డ న‌టుడు అనంత్ నాగ్ కీల‌క పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ్ చేస్తున్నారు.