నితిన్ ని దారుణంగా దెబ్బకొట్టిన విజయ్ దేవరకొండ


Nithin shocked with vijay devarakondaఇద్దరు కూడా తెలంగాణ హీరోలే ! అయితే ఒకరు సీనియర్ హీరో మరొకరు జూనియర్ అన్నమాట ! అయితే సీనియర్ హీరో ని దారుణంగా దెబ్బకొట్టాడు జూనియర్ హీరో. ఇంతకీ ఆ ఇద్దరు తెలంగాణ హీరోలు ఎవరు ? సీనియర్ ని దెబ్బ కొట్టిన జూనియర్ ఎవరయ్యా అంటే ……. నితిన్ , విజయ్ దేవరకొండ లు . నితిన్ హీరోగా పరిచయమై అప్పుడే 16 సంవత్సరాలు పూర్తయ్యాయి , అయితే టాప్ స్టార్ గా స్టార్ డం అందుకోలేక పోయాడు కానీ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు . ఇక విజయ్ దేవరకొండ నటుడిగా పరిచయమై ఏడేళ్లు దాటింది . అయితే అతడు హీరోగా కాదు సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు .

కట్ చేస్తే ఇప్పుడు విజయ్ దేవరకొండ యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో . ఈ నెలలో నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదల అయ్యింది . ఆ సినిమా వారం రోజుల్లో పది కోట్ల షేర్ సాధిస్తే విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం కేవలం రెండు రోజుల్లోనే 10 కోట్ల షేర్ రాబట్టింది . గీత గోవిందం చిత్రానికి వసూళ్లు బాగా వస్తున్నాయి దాంతో శ్రీనివాస కళ్యాణం కు ప్రేక్షకులు లేక థియేటర్ లన్ని వెలవెలబోతున్నాయి . కనీసం ఇంకొంత వసూళ్లు వస్తాయేమో అని ఆశించారు కట్ చేస్తే విజయ్ దేవరకొండ నితిన్ ఆశలకు గండికొట్టాడు . విజయ్ దేవరకొండ దెబ్బకు శ్రీనివాస కళ్యాణం విలవిలలాడుతోంది .

English title: nithin shocked with vijay devarakonda

Nithin shocked with vijay devarakonda