శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ టాక్


nithin srinivasa kalyanam trailer

నితిన్ రాశి ఖన్నా జంటగా శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం ” శ్రీనివాస కళ్యాణం ”. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా అలరిస్తోంది . తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం , మరో విశేషం ఏంటంటే ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కాగా అదేరోజున శ్రీనివాస కళ్యాణం విడుదల అవుతుండటం .

ప్రేమ పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కుటుంబకథా చిత్రాలు కోరుకునే వాళ్లకు బాగా నచ్చుతోంది . ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే చిత్రాలు తక్కువగా వస్తున్న ఈరోజుల్లో శ్రీనివాస కళ్యాణం తప్పకుండా వాళ్ళ ఆలోచనలకూ దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే . నితిన్ కూడా చాలా రోజులుగా వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు దాంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు . ఆగస్టు 9న విడుదల అవుతున్న చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కుర్రకారు బ్రహ్మరథం పడతారని నమ్మకంగా ఉన్నారు దిల్ రాజు . ట్రైలర్ లో నితిన్ – రాశి ఖన్నా జంట బాగుంది అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కోరుకునే అన్ని అంశాలు టచ్ చేసేలా ఉంది శ్రీనివాస కళ్యాణం .

English Title: nithin srinivasa kalyanam trailer talk