నేచుర‌ల్ స్టార్‌ని ఫాలో అవుతున్న నితిన్‌!


నేచుర‌ల్ స్టార్‌ని ఫాలో అవుతున్న నితిన్‌!
నేచుర‌ల్ స్టార్‌ని ఫాలో అవుతున్న నితిన్‌!

యంగ్ హీరో నితిన్ నేచుర‌ల్ స్టార్ నానిని ఫాలో కాబోతున్నారా? అంటే అత‌ని ప్లానింగ్ చూస్తే నిజ‌మే అనిపిస్తోంది. నాని ఏడాదికి రెండు నుంచి మూడు చిత్రాల్లో న‌టిస్తున్నారు. రెండు లేదా మూడు చిత్రాలు ఏడాదికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే ఫార్ములాను హీరో నితిన్ పాలో అవ్వాల‌నుకుంటున్నార‌ట. అయితే ఈ ఏడాది నుంచి ఆ ప్లాన్‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌నుకున్నార‌ట‌. కానీ క‌రోనా నితిన్ ప్లాన్‌కు గ‌ట్టి షాకిచ్చింది.

`భీష్మ‌` సూప‌ర్‌ హిట్  త‌రువాత నితిన్ వ‌రుస‌గా చిత్రాల్ని లైన్‌లో పెట్టాడు. వెంకీ అట్లూరి `రంగ్ దే`. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో `చెక్‌`, కృష్ణ‌చైత‌న్య‌తో `ప‌వ‌ర్ పేట‌`, మేర్ల‌పాక గాంధీతో `అంధాధున్` రీమేక్‌..ఇలా వ‌రుస చిత్రాల్ని ప్లాన్ చేసుకున్నాడు. కానీ క‌రోనా దెబ్బ‌తో ప్లాన్ అంతా రివ‌ర్స్ అయిపోయింది. `భీష్మ‌` త‌రువాత వెంట‌నే `రంగ్ దే` చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకున్నాడు. కానీ కుద‌ర‌లేదు.

చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో `చెక్‌`, కృష్ణ‌చైత‌న్య‌తో `ప‌వ‌ర్ పేట‌`, మేర్ల‌పాక గాంధీతో `అంధాధున్` రీమేక్ అని అనుకున్న టైమ్‌కు ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేశాడు. ఇందులో రెండు చిత్రాల‌కు నితిన్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. వీటి కోసం భారీ స్థాయిలోనే ఫైనాన్స్ తీసుకున్నారు నితిన్‌. ఇప్పుడ‌ది గుదిబండ‌గా మార‌బోతోంది. మూడున్న‌ర నెల‌లు షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఆర్థికంగా ఇబ్బందుల్ని సృష్టించే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.