నితిన్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేస్తోంది!

నితిన్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేస్తోంది!
నితిన్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేస్తోంది!

ఇటీవ‌ల `చెక్‌` మూవీ ఫ్లాప్‌తో కొంత నిరుత్సాహానికి గుర‌య్యారు హీరో నితిన్. అయితే ఈ శుక్ర‌వారం విడుద‌లైన‌ `రంగ్ దే` స‌క్సెస్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారాయ‌న‌. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఆశించిన స్థాయికి మించి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. గ‌డిచిన మూడు రోజుల్లో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 12 కోట్ల‌కు మించి షేర్‌ని సాధించి నిర్మాత‌కు లాభాల్ని తెచ్చిపెడుతోంది. ఈ మూవీ స‌క్సెస్ ఆనందంలో వున్న హీరో నితిన్ వెంట‌నే త‌న త‌దుప‌రి చిత్ర షూటింగ్‌లో ని‌మ‌గ్న‌మ‌య్యారు.

ఈ మూవీ త‌రువాత హీరో నితిన్ బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `అంధాధున్‌` రీమేక్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్ న‌టిస్తోంది. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై నితిన్ ఫాద‌ర్ ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, సిస్ట‌ర్ నిఖితా రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీ ప్రీలుక్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ సోమ‌వారం రిలీజ్ చేశారు. నితిన్ పుట్టిన రోజు మంగ‌ళ‌వారం కావ‌డంతో ఆ రోజు 12 గంట‌ల‌కు ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట్‌ర్‌ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో త‌మ‌న్నా గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మ‌రింత బోల్డ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇదిలా వుంటే ప్రీ లుక్‌ని రిలీజ్ చేసిన మేక‌ర్స్ ఈ చిత్రానికి ఏ టైటిల్‌ని ప్ర‌క‌టించ‌బోతున్నార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.