బిగ్ స్క్రీన్‌లో హిట్టు.. స్మాల్ స్క్రీన్‌లో ఫ‌ట్టు!

బిగ్ స్క్రీన్‌లో హిట్టు.. స్మాల్ స్క్రీన్‌లో ఫ‌ట్టు!
బిగ్ స్క్రీన్‌లో హిట్టు.. స్మాల్ స్క్రీన్‌లో ఫ‌ట్టు!

బిగ్ స్క్రీన్‌లో హిట్టయిన సినిమా స్మాల్ స్క్రీన్‌లో ఫ‌ట్టయి షాకిచ్చింది. అదే యంగ్ హీరో నితిన్ మూవీ `భీష్మ‌`. వ‌రుస మూడు ఫ్లాపుల త‌రువాత నితిన్‌కి `భీష్మ‌`తో భారీ విజ‌యం ల‌భించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల తెర‌కెక్కించాడు. ఈ ఏడాది లాక్‌డౌన్‌కి నెల ముందు ఈ మూవీ విడుద‌లైంది.

మంచి టాక్‌ని సొంతం చేసుకుని సూప‌ర్ హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. కానీ టెలివిజ‌న్‌లో మాత్రం ఫ్లాప్  టాక్‌ని తెచ్చుకోవ‌డం మేక‌ర్స్‌ని షాక్ కు గురిచేసింది. అక్టోబ‌ర్ 25న `భీష్మ‌` చిత్రాన్ని జెమినీ టెలివిజ‌న్ టెలికాస్ట్ చేసింది. 10 టీఆర్పీ రేటింగ్ రావాల్సిన ఈ చిత్రానికి 6.65 రేటింగ్ మాత్ర‌మే రావ‌డం జెమినీ టెలివిజ‌న్‌తో పాటు `భీష్మ‌` మేక‌ర్స్‌కి షాకిచ్చింది.

ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టించిన `సాహో` చిత్రానికి కూడా ఇదే అనుభ‌వం ఎదురైంది. ఈ చిత్రానికి 6 లోపు టీఆర్పీ రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మ‌ద‌నం మొద‌లైంది. ఓటీటీ మార్కెట్ కార‌ణంగా డిజిటల్ శాటిలైట్ రైట్స్ దెబ్బ‌తినే అవ‌కాశం వుంద‌ని భావిస్తున్నారు. దీని వ‌ల్లే టీఆర్పీ రేటింగ్ ప‌డిపోయింద‌ని వాపోతున్నారు.