లాక్‌డౌన్ నుంచి లాక‌ప్ కు నితిన్‌‌


లాక్‌డౌన్ నుంచి లాక‌ప్ కు నితిన్‌‌
లాక్‌డౌన్ నుంచి లాక‌ప్ కు నితిన్‌‌

యంగ్ హీరో నితిన్ ఇటీవ‌ల వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. రెట్టించిన ఉత్సాహంతో వున్న ఆయ‌న వ‌రుస‌గా త‌ను న‌టిస్తున్న చిత్రాల్ని సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు. ఇటీవ‌లే త‌ను న‌టిస్తున్న `రంగ్ దే` చిత్ర షూటింగ్‌ని ప్రారంభించి టాకీ పార్ట్‌ని పూర్తి చేశారు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

త్వ‌ర‌లో ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ కోసం చిత్ర బృందం ఇట‌లీ వెళ్ల‌బోతోంది. ఆలోగా నితిన్ మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. ఆయ‌న న‌టిస్తున్న త‌దుప‌రి చిత్రం `చెక్‌`. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వింక్‌ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఓ ఖైదీ క‌థ‌గా ఈ చిత్రాన్ని కొత్త పంథాలో తెర‌కెక్కిస్తున్నారు. ర‌కుల్ లాయ‌ర్‌గా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ల‌వ‌ర్‌గా ఈ ఇచ‌త్రంలో క‌నిపించ‌బోతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా నితిన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ఓ పోస్ట‌ర్‌ని పంచుకున్నారు. `లాక్ డౌన్ టు లాక‌ప్‌` అంటూ రాసివున్న ఈమూవీ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.