నితిన్ `చెక్` మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌!


నితిన్ `చెక్` మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌!
నితిన్ `చెక్` మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

`భీష్మ‌` హిట్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు హీరో నితిన్‌. ఈ మూవీ స‌క్సెస్‌తో మాంచి జోష్ మీదున్న నితిన్ వ‌రుస‌గా సినిమాల‌ని లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే రెండు చిత్రాల్ని పూర్తి చేశాడు. వెంకీ అట్లూరి తో చేస్తున్న `రంగ్ దే` చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంతోంది. త్వర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఇదిలా వుంటే నితిన్ మ‌రో చిత్రం కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `చెక్‌`. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం తాజాగా ప్ర‌క‌టించింది.

ఓ ఖైదీ క‌థ‌గా జైలు నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ త‌న ల‌క్ష్య‌న్ని ఛెస్ గేమ్ ద్వారా ఎలా నెర‌వేర్చుకున్నాడ‌న్న‌దే ఇందులో ప్ర‌ధాన క‌థాంశం. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటికి మంచి పేరుంది. ఆయ‌న గ‌త చిత్రాల‌కు మించి ఈ సినిమా వుండ‌బోతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌కి మంచి స్పంద‌న ల‌భించింది.

 

View this post on Instagram

 

A post shared by N I T H I I N (@actor_nithiin)