అప్పుడే సేఫ్ జోన్‌లోకి వెళ్లిన నితిన్ `చెక్‌`

అప్పుడే సేఫ్ జోన్‌లోకి వెళ్లిన నితిన్ `చెక్‌`
అప్పుడే సేఫ్ జోన్‌లోకి వెళ్లిన నితిన్ `చెక్‌`

ఎంట‌ర్‌టైన్‌మెంట్ నేప‌థ్యంలో రూపొందిన `భీష్మ‌` చిత్రంతో గ‌తేడాది సాలీడ్ హిట్‌ని త‌న ఱ‌ఖాతాలో వేసుకున్నాడు నితిన్‌. ఈ మూవీ స‌క్సెస్ జోష్‌లో వున్న నితిన్ త్వ‌ర‌లో మ‌రో విభిన్న‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `చెక్‌`. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరుతెచ్చుకున్న చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

ఉరి శిక్ష ప‌స‌డిన ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందింస్తున్నారు. ఉరిశిక్ష ప‌డిన ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? .. త‌న ప్ర‌త్యర్థుల్ని ఎలా మ‌ట్టి క‌రిపించాడు? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన ఇతివృత్తం. ఇటీవ‌ల విడుద‌లై ఈ చిత్ర ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. సిన‌మా ఆస‌క్తిక‌రంగా వుంటుంద‌నే ఫీలింగ్‌ని ప్రేక్ష‌కుల్లో క‌లిగించింది.

దీంతో ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఈ చిత్ర నైజాం రైట్స్‌ని వ‌రంగ‌ల్ శ్రీ‌ను 5 కోట్ల‌కు సొంతం చేసుకున్నార‌ట‌. వంద శాతం ఆక్యుపెన్సీకి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ చిత్ర‌ బృందం అప్పుడే ప్రాఫిట్‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 15 కోట్ల మేర బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలిసింది. శాలిలైట్ రైట్స్ రూపంలో మ‌రో 12 కోట్లు రానున్న‌ట్టు  చిత్ర వ‌ర్గాల స‌మాచారం. దీంతో `చెక్‌` టీమ్ రిలీజ్‌కి ముందే లాభాల్లోకి ఎంట‌రైంద‌ని చెబుతున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ మార్చి 26న విడుద‌ల కాబోతోంది.