`చెక్‌` ట్రైల‌ర్ టాక్‌: ఉరిశిక్ష ప‌డిన చెస్ జీనియ‌స్ క‌థ‌

`చెక్‌` ట్రైల‌ర్ టాక్‌: ఉరిశిక్ష ప‌డిన చెస్ జీనియ‌స్ క‌థ‌
`చెక్‌` ట్రైల‌ర్ టాక్‌: ఉరిశిక్ష ప‌డిన చెస్ జీనియ‌స్ క‌థ‌

`భీష్మ‌` చిత్రంతో గ‌త ఏడాది సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకున్న నితిన్ మ‌రో విభిన్న‌మైన చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `చెక్‌`. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటూ త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల్ని మాత్ర‌మే తెర‌పైకి తీసుకొచ్చే వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఉరి శిక్ష ప‌డిన చెస్ జీనియ‌స్ క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని భవ్యా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని చిత్ర బృందం బుధ‌వారం సాయంత్రం రిలీజ్ చేసింది. `య‌ద్భావం త‌ద్భ‌వ‌తీ.. అనువు నుంచి అనంతం వ‌ర‌కు ఏదీ క‌ర్మ‌ను త‌ప్పించుకోలేదు.. అంటూ ముర‌ళీశ‌ర్మ వాయిస్‌త‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. `అహం నియ‌తిం నిశ్చామి..అంటూ ఉరిశిక్ష‌ప‌డిన ఖైదీగా నితిన్ ఇందులో న‌టించాడు.

ఏం చేసినా అపోనెంట్ వుంటేనేగా కిక్కు నేను కూడా ఆడొచ్చా.. అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌లు.. ఇది ఏనుగు.. దీని దారి ర‌హ‌దారి..దీనికి ఎదురెళ్లాలంటే ద‌మ్ము కావాలి.. ఇది ఒంటే దీనిమీద ఎప్పుడూ క‌న్నేసి వుంచాలి. అంటూ న‌టుడు సాయిచంద్ చెబుతున్న డైలాగ్‌లు పాత్ర‌ల తీరుని చెబుతున్నాయి. ఉరిశిక్ష ప‌డిన ఆదిత్య ని క్ష‌మాభిక్ష ద్వారా బ‌య‌టికి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించే లాయ‌ర్ గా ర‌కుల్ ప్రీత్‌సింగ్ క‌నిపిస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌లో యాత్ర‌గా వింక్ గ‌ర్ల్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టించింది. నితిన్‌ని ఇరికించే పోలీస్ పాత్ర‌లో సంప‌త్‌రాజ్ క‌నిపిస్తున్నారు. మొత్తానికి వైవిధ్య‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి `చెక్‌` చిత్రాన్ని కూడా అదే స్కూల్‌లో తెర‌కెక్కించారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. `చెక్‌` బాక్సాఫీస్ వ‌ద్ద నితిన్‌ మ‌రో హిట్ సొంతం చేసుకోవ‌డం గ్యారెంటీ.