`మాస్ట్రో` ఫ‌స్ట్ గ్లింప్స్ : ఓ అంధుడి పోరాటం!

Nithins Maestro first glimps is Out
Nithins Maestro first glimps is Out

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `రంగ్ దే` చిత్రంతో హీరో నితిన్ మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంలో వున్న హీరో నితిన్ త‌న పుట్టిన రోజున కొత్త చిత్రానికి సంబంధించ‌యిన అప్‌డేట్ ఇచ్చేశారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `మాస్ట్రో`. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `అంధాదున్‌`కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌‌స్ట్ లుక్ న కూడా రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా ఈ సాయంత్రం ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ని విడుద‌ల చేసింది.  థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో నితిన్ తొలిసారి న‌టిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు నితిన్ అభిమానులు కూడా ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `నితిన్ పియానా వాయిస్తున్న విజువ‌ల్స్‌.. ఆ త‌రువాత పిల్లి నియానో మెట్ల‌పై న‌డ‌వ‌డం… ఆ వెంట‌నే నితిన్ నిండుగా వాట‌ర్ వున్న బ‌క్కెట్‌లో త‌ల ముంచి క‌ళ్లు తెర‌వ‌డం… అంధుడిగా త‌న లుక్‌ని చూపించ‌డం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ నేప‌థ్య సంగీతం ఈ స‌న్నివేశాల్ని ఎలివేట్ చేసిన తీరు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.