నితిన్ రెండు చిత్రాలు ఓటీటీకేనా?

నితిన్ రెండు చిత్రాలు ఓటీటీకేనా?
నితిన్ రెండు చిత్రాలు ఓటీటీకేనా?

ఈ ఏడాది నితిన్ నటించిన `భీష్మ‌` అనూహ్య విజ‌యాన్ని సాధించి హీరో నితిన్ ని మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. `అఆ` త‌రువాత నితిన్ వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్నారు. ఆ క్ర‌మంలో నితిన్‌కి ల‌భించిన మాసీవ్ హిట్ `భీష్మ‌`. ఈ మూవీ స‌క్సెస్ ఆనందంలో వున్న నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల్ని లైన్‌లో పెట్టారు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో `రంగ్‌దే`.., చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో `చెక్` చిత్రాలు చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ రెండు మూవీస్‌ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వున్నాయి. ఇదిలా వుంటే ఈ రెండు చిత్రాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం లేద‌ని తెలిసింది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి రూపొందిస్తున్న `చెక్` చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని జీ5లో రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయని తెలిసింది.

ఇక వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే` చిత్రాన్ని కూడా జీ5లోనే రిలీజ్ చేస్తున్నార‌ట‌. నితిన్‌తో క‌లిసి కీర్తిసురేష్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తియింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. జీ5లో ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించిన ఫైన‌ల్ టాక్ కూడా కంప్లీట్ అయిన‌ట్టు చెబుతున్నారు. ఉన్న‌ట్టుండి నితిన్‌రెండు చిత్రాలు ఓటీటీ రిలీజ్‌కు రెడీ కావ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది.