నితిన్ `రంగ్ దే` షూటింగ్ కంప్లీట్!

Nithins Rang de movie shoot wrapped
Nithins Rang de movie shoot wrapped

`భీష్మ` సూప‌ర్‌హిట్ కావ‌డంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు నితిన్‌. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ జోష్‌లో వున్న నితిన్ వ‌రుస‌గా మూడు చిత్రాల్ని ప‌ట్టాలెక్కించారు. అందులో ఓ మూవీ షూటింగ్ కూడా పూర్తియిపోయింది. అదే `రంగ్ దే`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ అ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయింది. ఇదే విష‌యాన్ని చిత్ర బృందం బుధ‌వారం వెల్ల‌డించింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు మొద‌లైన ఈ మూవీ ఇటీవ‌ల పునః ప్రారంభ‌మై తాజాగా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే నెల 26న రిలీజ్ చేయ‌బోతున్నారు.

నితిన్ న‌టించిన `చెక్‌` మూవీ ఈ నెల 26న రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దేశ ద్రోహం కేసుకింద ఉరిశిక్ష‌ప‌డిన ఓ ఖైదీ క‌థ‌గా విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టించారు.