`రంగ్ దే` టీమ్ ఇక అక్క‌డ మొద‌లుపెడుతుంద‌ట‌

`రంగ్ దే` టీమ్ ఇక అక్క‌డ మొద‌లుపెడుతుంద‌ట‌
`రంగ్ దే` టీమ్ ఇక అక్క‌డ మొద‌లుపెడుతుంద‌ట‌

నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `రంగ్ దే`. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో మొద‌లైన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్‌ని టీమ్ విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పీసీ శ్రీ‌రామ్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇటీవ‌లే టాకీ పార్ట్ కి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే విజ‌యంతంగా షూటింగ్ ని పూర్తి చేశారు. ఇక పాట‌ల‌తో పాటు కొంత పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్‌గా వుంద‌ట.. దీంతో చిత్ర బృందం పాట‌ల్ని ఇట‌లీలో షూట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకు కోసం డేట్‌ని కూడా ఫిక్స్ చేసుకుంది.

పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం ఈ నెల 26 న `రంగ్ దే ` టీమ్ ఇట‌లీ బ‌య‌లుదేరి వెళ్ల‌బోతోంది. కీర్తి సురేష్‌, నితిన్‌ల‌పై రొమాంటిక్ సాంగ్స్‌ని అక్క‌డ షూట్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ న‌టిస్తున్న `రాధేశ్యామ్‌` టీమ్ ఇటీలీలో షూటింగ్ చేస్తోంది. గ‌త రెండు వారాలుగా అక్క‌డ షూటింగ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో `రంగ్ దే` టీమ్ కూడా ఇట‌లీ వెళుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.