నితిన్ రంగ్ దే ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్‌!

 

Nithins Rang de pre release business adurs
Nithins Rang de pre release business adurs

నితిన్ న‌టించిన‌ చిత్రం `రంగ్ దే`, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26 ప్ర‌పంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుద‌ల కాబోతోంది. రిలీజ్‌కు ముందే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నితిన్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే `చెక్‌` ఫ‌లితం త‌రువాత ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇటీవ‌లే ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌ హక్కులు కూడా భారీ స్థాయిలో అమ్ముడయ్యాయట‌. ఈ మూవీ ఓవ‌ర్సీస్ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్‌కు 1.5 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇటీవల విడుదలైన ఉప్పెన, జాతి రత్నలు చిత్రాలు అద్భుతమైన ఫ‌లితాన్ని అందించ‌డంతో ఈ చిత్రానికి ఈ స్థాయిలో రేట్ ప‌లికిన‌‌ట్టు చెబుతున్నారు.

`రంగ్ దే` మొత్తం ప్రీ రిలీజ్బిజినెస్‌ 37.5 కోట్లు జ‌రిగింది. దీంతో విడుదలకు ముందే మేక‌ర్స్ లాభాల్లోకి ఎంట‌ర‌య్యారు. నితిన్, కీర్తిసురేష్‌ల‌ న‌ట‌న‌, పీసీ శ్రీ‌రామ్ ఫొటోగ్ర‌ఫీ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 26న థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా ఏ స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతుందో చూడాలి.