మ‌రో బ‌యోపిక్‌ని రిజెక్ట్ చేసిందా?


మ‌రో బ‌యోపిక్‌ని రిజెక్ట్ చేసిందా?
మ‌రో బ‌యోపిక్‌ని రిజెక్ట్ చేసిందా?

నిత్యామీన‌న్ విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వ‌స్తోంది.  మ‌రో బ‌యోపిక్‌ని రిజెక్ట్ చేసిన‌ట్టు తెలిసింది. గీత గోవిందం, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రాల్లో ప్ర‌త్యేక అతిథి పాత్ర‌ల్లో న‌టించిన నిత్యామీన‌న్ ఈ మ‌ధ్య మ‌రే తెలుగు చిత్రాన్ని అంగీక‌రించ‌లేదు. తాజాగా ఆమె ఓ తెలుగు చిత్రాన్ని రిజెక్ట్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

తొలి భార‌తీయ మ‌హిళా వెయిట్ లిప్ట‌ర్ క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి జీవిత క‌థ ఆధారంగా కోన వెంక‌ట్‌, ఎం.వి.వి. స‌త్య‌నారాయ‌ణ ఓ బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురానున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంజ‌న రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఇటీవ‌లే క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి పుట్టిన రోజు సంద‌ర్భంగా వెల్ల‌డించింది.

ఈ చిత్రంలో క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి పాత్ర‌ని ఎవ‌రు చేస్తారా అనే చ‌ర్చ మొద‌లైంది. మేక‌ర్స్ నిత్యామీన‌న్‌ని ఆ పాత్ర కోసం సంప్ర‌దించార‌ట‌. అయితే నిత్యామీన‌న్ మాత్రం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. కార‌ణం ఏంట‌నేది మాత్రం ఇంకా తెలియ‌రాలేదు. ఆ మ‌ధ్య `మ‌హ‌న‌టి` చిత్రాన్ని కూడా నిత్యామీన‌న్ తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే.