అలా చేయమంటే ఇలా చేసిందేంటో


Nithya menon to play savitri role in ntr biopic

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవరామతారకం పాత్రలో నటించమని నిత్యామీనన్ కు ఆఫర్ ఇస్తే నో చెప్పేసింది కట్ చేస్తే మహానటి సావిత్రి పాత్ర చేయమని అడిగితే వెంటనే ఒప్పేసుకుంది దాంతో ఆ పాత్ర చేయమంటే నో చెప్పడం ఏంటి ? చిన్న పాత్రలో నటిస్తానని ముందుకు రావడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు ఆ చిత్ర బృందం . నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ” ఎన్టీఆర్ ” బయోపిక్ . ఆ సినిమాలో మొదట నిత్యా మీనన్ ని నటించమని కోరారట ! కానీ ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించనని రిజెక్ట్ చేసింది కట్ చేస్తే సావిత్రి పాత్ర కు ఓకే చెప్పింది అయితే సావిత్రి పాత్ర కొన్ని సీన్లు మాత్రమే ఉంటాయి మరి .

నిత్యామీనన్ నో చెప్పడంతో బాలీవుడ్ డర్టీ సుందరి విద్యాబాలన్ ని ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చారు . విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడం వల్ల కూడా మంచే జరిగింది . ప్రాజెక్ట్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ వస్తోంది . అలాగే అక్కినేని గా సుమంత్ అచ్చు గుద్దినట్లు సరిపోయాడు . హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు , అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడం ఖాయమని తెలుస్తోంది . అయితే ఎప్పుడు ? ఏ పాత్ర అన్నది బాలయ్య మాత్రమే చెప్పాలి .

English Title: Nithya menen to play savitri role in ntr biopic