పవన్, రానాలకు పెయిర్ లు దొరికేశారోచ్!

పవన్, రానాలకు పెయిర్ లు దొరికేశారోచ్!
పవన్, రానాలకు పెయిర్ లు దొరికేశారోచ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ షూటింగ్ శరవేగంగా సాగింది. కరోనా సెకండ్ వేవ్ ఈ స్పీడ్ కు బ్రేకులేసింది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండగా సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో బాగానే తర్జన భర్జన నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ లు ఎంపికైనట్లు సమాచారం. వీరిద్దరూ కూడా జులై రెండో వారం నుండి షూటింగ్ లో పాల్గొంటారు.

నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రను పోషిస్తుండగా ఐశ్వర్య రాజేష్ రానాకు పెయిర్ గా చేస్తోంది. వీరిద్దరివీ చిన్న రోల్స్ కాబట్టి త్వరగా వారి పాత్రల చిత్రణ పూర్తవుతుందని సమాచారం.