ఎంగేజ్ మెంట్ చేసుకున్న హీరోయిన్


Niti Talor Shares her Mehendi pics
Niti Talor Shares her Mehendi pics

హీరోయిన్ నీతి టేలర్ పెళ్ళికి సిద్ధమైంది .

తన చిరకాల మిత్రుడు పరీక్షిత్ బావాను నీతి టేలర్ పెళ్లి చేసుకోనుంది .

తెలుగులో రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది నీతి . తనీష్ హీరోగా నటించిన ” మేము వయసుకి వచ్చాం ” , రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన ” పెళ్లి పుస్తకం ” చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది నీతి అయితే మేము వయసుకి వచ్చాం మంచి హిట్ అయినప్పటికీ పాపం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు ఈ భామకు .

ఇక హిందీలో పలు సీరియల్ లలో కూడా నటించింది . కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తన స్నేహితుడ్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపొయింది .

నిన్న నీతి టేలర్ ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది , ఇక త్వరలోనే పెళ్లి చేసుకోనుంది .

తన ఎంగేజ్ మెంట్ కి సంబంధించి న వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది నీతి టేలర్ .