ఇంతకీ ‘వాల్మీకి’లో నితిన్ రోల్ ఏంటంటే..!


Varun Tej And Nithin
ఇంతకీ ‘వాల్మీకి’లో నితిన్ రోల్ ఏంటంటే..!

హరీష్ శంకర్ కు ఎంటర్టైన్మెంట్ ఎలా రాబట్టాలో బాగా తెలుసు. ముఖ్యంగా అది రీమేక్ అయితే హరీష్ కు ఆ పని ఇంకా సులువవుతుంది. అప్పుడు గబ్బర్ సింగ్ కు చేసినట్లుగానే ఇప్పుడు వాల్మీకి కి కూడా అదనపు ఆకర్షణలు జోడించాడు హరీష్ శంకర్. ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను జోడించాడు. అందులో పూజ హెగ్డేను పెట్టి సినిమాకు గ్లామర్ తీసుకొచ్చాడు. సూపర్ హిట్ సాంగ్ “ఎల్లువొచ్చి గోదారమ్మ” సాంగ్ ను రీమిక్స్ చేయించాడు. దర్శకుడు సుకుమార్ చేత ఒక కామియో రోల్ వేయించాడు. లేటెస్ట్ గా తెల్సిన విషయం హీరో నితిన్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట.

ఈ విషయాన్ని నిన్నే వరుణ్ తేజ్, నితిన్ ఇద్దరూ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు నితిన్ పోషించిన పాత్ర ఏమై ఉంటుందా అన్న సందేహాన్ని వెల్లిబుచ్చుతున్నారు ప్రేక్షకులు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తమిళ్ లో విజయ్ సేతుపతి చేసిన పాత్ర, ఇక్కడ నితిన్ చేసాడట. దర్శకుడు కావాలనుకునే ప్రయత్నాల్లో అధర్వ సినిమా చివర్లో నితిన్ ను బెదిరించి తన సినిమాకు ఒప్పిస్తాడట. ఐతే ఇది నిజమో కాదో తెలియాలంటే రేపటి దాక ఎదురుచూడాల్సిందే.